కురాన్ - 2:253 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

۞تِلۡكَ ٱلرُّسُلُ فَضَّلۡنَا بَعۡضَهُمۡ عَلَىٰ بَعۡضٖۘ مِّنۡهُم مَّن كَلَّمَ ٱللَّهُۖ وَرَفَعَ بَعۡضَهُمۡ دَرَجَٰتٖۚ وَءَاتَيۡنَا عِيسَى ٱبۡنَ مَرۡيَمَ ٱلۡبَيِّنَٰتِ وَأَيَّدۡنَٰهُ بِرُوحِ ٱلۡقُدُسِۗ وَلَوۡ شَآءَ ٱللَّهُ مَا ٱقۡتَتَلَ ٱلَّذِينَ مِنۢ بَعۡدِهِم مِّنۢ بَعۡدِ مَا جَآءَتۡهُمُ ٱلۡبَيِّنَٰتُ وَلَٰكِنِ ٱخۡتَلَفُواْ فَمِنۡهُم مَّنۡ ءَامَنَ وَمِنۡهُم مَّن كَفَرَۚ وَلَوۡ شَآءَ ٱللَّهُ مَا ٱقۡتَتَلُواْ وَلَٰكِنَّ ٱللَّهَ يَفۡعَلُ مَا يُرِيدُ

ఆ సందేశహరులు! మేము వారిలో కొందరికి మరికొందరిపై ఆధిక్యత నిచ్చాము[1]. వారిలో కొందరితో అల్లాహ్ (నేరుగా) మాట్లాడాడు[2]. మరికొందరిని (గౌరవనీయమైన) ఉన్నత స్థానాలకు ఎత్తాడు. మరియు మర్యమ్ కుమారుడు ఈసా (ఏసు)కు మేము స్పష్టమైన సూచనలు ప్రసాదించి, అతనిని పరిశుద్ధాత్మ (జిబ్రీల్) సహాయంతో బలపరిచాము. మరియు - అల్లాహ్ తలుచుకుంటే - ఈ ప్రవక్తల తరువాత వచ్చిన ప్రజలు, వారికి స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాత కూడా పరస్పరం కలహించుకునేవారు కాదు. కానీ, వారు పరస్పర విభేదాలకు లోనయ్యారు. కావున వారిలో కొందరు విశ్వాసులయ్యారు మరికొందరు సత్యతిరస్కారులు అయ్యారు. మరియు అల్లాహ్ తలుచుకుంటే వారు పరస్పరం కలహించుకునేవారు కాదు, కాని అల్లాహ్ తాను కోరిందే చేస్తాడు.[3]

సూరా సూరా బకరా ఆయత 253 తఫ్సీర్


[1] చూడండి, 17:55. [2] మూసా ('అ.స.) తో అల్లాహ్ (సు.తా.) మాట్లాడిన దానికి చూడండి, 4:164. 'ఈసా ('అ.స.) సూచనల కొరకు చూడండి, 3:46, 49. [3] ఈ విధమైన ఆయత్ ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు వచ్చింది. అల్లాహ్ (సు.తా.)కు తాను అవతరింపజేసిన ధర్మంలో భేదాభిప్రాయాలు కల్పించటం ఏ మాత్రం నచ్చదు. ప్రజలంతా ఆయన అవతరింపజేసిన ధర్మాన్నే అనుసరించి నరకాగ్ని నుండి రక్షించబడాలనే అల్లాహుతా'ఆలా కోరిక. కావున ఆయన ప్రవక్తలను మానవుల నుండి ఎన్నుకొని వారిపై దివ్యగ్రంథాలను అవతరింపజేస్తాడు మరియు మ'హమ్మద్ ('స' అస) ను చివరి ప్రవక్తగా ఎన్నుకున్నాడు. అతని తరువాత ఖలీఫాలు మరియు ధర్మశాస్త్రవేత్తలు, ద'వఅహ్ తో అల్లాహ్ (సు.తా.) ధర్మం (ఇస్లాం) ను వ్యాపింపజేస్తున్నారు.

Sign up for Newsletter